ఆ'కలి' పురుషుని లీలా ఈ ఆకలి? లేక ఈ ఆధిపత్య పోరు పెట్టిస్తున్న కేకల మాలికా ఈ ఆకలి???
ప్రపంచంలో ఆకలి కేకల సంఖ్య 79.5 కోట్లు.
వారిలో 50% భూమిని నమ్ముకున్న రైతులే.. కరవు,వరదలూ.. వాటిని జయించలేని నాయకత్వాలు..
20% మంది భూమి లేక..
ఇంకో 20% మంది స్మార్టు నగరాలలోని స్లమ్ములలో..
మిగిలిన 10% మత్స్య సంపద, అడవులపై ఆధారపడిన వారు..
ఈ లెక్కలు చూస్తుంటే.. ముందు మన చేతకానితనం.. తర్వాత మన స్వార్ధం కనిపిస్తున్నాయి కదా..
ఇంకా ఉన్నాయి..
14.6 కోట్ల మంది పిల్లలు ఇంకా ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుతో ఉన్నారు. ఇది ఎక్కడో ఆఫ్రికాలో కాదు.. ముమ్మాటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన సంఖ్య ఇది. ఇక మిగిలిన వారి మాటేంటి???
గర్భం దాల్చిన మహిళలలో 50% మందికి ఐరన్ లోపం ఉంటోంది.
ఈ గణాంకాలు World Food Programs వారిచే సేకరించబడినవి
No comments:
Post a Comment