ఒకరికి మంచి జరిగితే... కచ్చితంగా మరొకరికి చెడు జరగాల్సిందేనా..???
ఆనంద పడుతున్నాం.. రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందుకు. మరోవైపు భాదపడుతున్నాం..పశ్చిమ గోదావరి.. గుంటూరు.. కృష్ణా జిల్లాలలో కురిసిన వర్షాలకి పంటలు నీట మునిగి మొలకలు వచ్చే పరిస్థితి వచ్చినందుకు..
మరీ దారుణంగా ఈ రోజు పశ్చిమగోదావరికి చెందిన రైతు.. 5 లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ వర్షాలు కొన్ని రోజులు ఆగి కురిసినట్టైతే.. రైతుల ఇళ్ళన్నీ ధాన్యపు రాశులతో కళకళలాడేవి.. ఇంతలో కురిసిన ఈ అకాల వర్షాల దెబ్బకి రైతుల కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
వేలకి వేలు ఎరువుల ఖర్చలు.. ప్రాణం కన్నా ఖరీదుగా మారిన పురుగు మందుల రేట్లు.. వెరసి రైతుల ఆత్మహత్యలు. అయినా సరే అప్పు చేసైనా నాలుగు నెలల పాటు పంటని నిలబెడితే.. అయదో నెలాఖరున రైతుల ఇళ్ళు ధాన్యపు బస్థాల కోసం ఎదురుచూస్తుంటే.. ఆ రైతుల నాలుగు నెలల కష్టాన్నీ ఒకేసారి ఆయా ఊర్ల చెరువుల్లో కలిపేసాయి ఈ వర్షాలు..
ఈపాటికి రైతులకి కూడా అలవాటైపోయి ఉంటుంది.. బాదపడటం.. కష్టపడటం..
కానీ వీటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ.. మళ్ళీ పైకి లేచి విత్తనం నాటుతున్నారు అంటే.. మీకంటే మగాడూ.. మొనగాడూ.. ఎవరుంటారు చెప్పండి ఈ ప్రపంచంలో..
ఏ రైతూ లాభం కోసం ఆశ పడరు.. అప్పులు తీర్చి, తమ ఖర్చులకు సరిపోతే చాలు అనుకుంటారు. అటువంటి రైతన్నకు ఇన్ని కష్డాలు రావడం చాలా బాధాకరం.
ప్రతీ రైతూ అప్పలూ.. కష్టాల నుంచి గట్టెక్కాలని కోరుకుంటూ..
No comments:
Post a Comment