ఏం అంతా మీరు చేస్తున్నది కాదా..?? అనుభవించలేరా..??
ఎందుకంత ఆపసోపాలు పడిపోతున్నారు..??
ఏ మీరు చేస్తున్న తప్పిదాలు కాదా ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం..??
ఏ మీ బద్ధకం కాదా.. ఈ వేడిమికి కారణం..??
ఏ మీ స్వార్ధ బుద్ధి కాదా.. ఈ దుస్థితికి కారణం..??
ఏ మీ నిర్లక్ష్యం కాదా.. ఈ పరిస్థితికి కారణం..??
మొక్కకి నీరు పోస్తే పండు ఇచ్చాను.. నాకు ఏది ఇస్తే అదే నేను ఇస్తాను.. మంచికి మంచిని ఇస్తాను.. చెడుకి చెడుని ఇస్తాను.. మీరు నాకు కాలుష్యాన్ని ఇస్తున్నారు.. కనుక నేను ఆ కాలుష్యాన్ని ప్యురిఫై చేసి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాను.. నాదెం తప్పుంది మీరే చెప్పండి..
కాబట్టి ఇందు మూలముగా ఏవన్మంది ప్రజలకు తెలియ చేస్తున్నది ఏమనగా.. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు..
మీరూ బ్రతకండి.. మొక్కలని బ్రతికించండి..
ఇలా కాదు.. కూడదు.. పర్లేదు.. అని ఏసి రూముల్లో కూర్చుని తల ఎగరేస్తానంటారా..??
సరే మీ ఇష్టం.. ఎప్పుడో ఒకసారి భూకంపం రూపంలో ఒక్క దెబ్బ కొడతా..
ఆ దెబ్బకి ఏసి రూము కాదు కదా.. ఉండడానికి జానెడు భూమి కూడా మిగలదు.. ఆలోచించుకోండి.. నిర్ణయం మీదే..
ప్రకృతి అడిగిన ఈ ప్రశ్నకు.. మీ దగ్గర ఎడిన సమాదానం ఉందా..?? ఉంటే తప్పకుండ తెలియచేయగలరు.

No comments:
Post a Comment