Wednesday, 4 May 2016

కేంద్రానికి ఏ.పీపై కరుణ ఉందా..?? లేదా..??




ఒకాసారి విభజన జరిగే సమయంలో పార్లమెంటుకి వెళితే.. అప్పటికే ఎందరో తెలంహాణ ఉద్యమకారుల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇటు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం తారా స్ధాయికి చేరుకుంది.

ఇదిలా ఉంటే..  కాంగ్రెసును కనీసం తెలంగాణలో అయినా బ్రతికించుకుందాం అనో.. లేక తెలుగు ప్రజలను మనసారా విడగొట్టాలి అనో.. అప్పటి యు.పి.ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బిజేపీతో పాటూ కేంద్రంలో మిగొలిన అన్ని పార్టీలూ మద్దతు తెలపడంతో.. విభజన అనివార్యం అయ్యింది.

ఈ పరిణామాలతో సీమాంధ్ర ప్రజలలో రాజధాని లేదు, ఆదాయం లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు అన్న భయం మొదలయ్యింది. ఈ భయాలను చెరపడానికి కాంగ్రెస్సుకు అవకాశం ఉన్నా.. దానిని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చెయ్యలేదు. కొన్ని అంశాలి బిల్లులో పెట్టనా.. అతి ముఖ్యమైన ప్రత్యేకహోదాని మాత్రం మరచింది. దీంతో వెంకయ్య మేం అధికారంలొకి వచ్చాక, ప్రత్యేకహోదా అయిదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తాం అని హామీ ఇచ్చారు.

విడిపోయి ఆదాయం లేక అన్యాయం అయిపోతున్న సీమాంధ్ర ప్రజల ఎం.పీలను పార్లమెంటు నుంచి బయటకు గెంటేసి.. తలుపులు మూసేసి.. టీ.వీ ప్రచారాలను ఆపేసి మరీ.. లోపల విభజన చేస్తున్నారా లేక వ్యభిచారం (may be sensor cut but its truth) చేస్తున్నారా అన్నట్లు విభజించి పడేసారు.

ఈ దెబ్బకి కాంగ్రెస్ కరెంటు షాక్ కొట్టిన కాకిలా ఎలక్షన్ల రిజల్టు చూసి కన్నీరు పెట్టుకుంది. బీజేపీ అధికారం చేపట్టింది
.
రెండేళ్లు పూర్తికావొస్తోంది.. ఇంకా 2014-2015 కు చెందిన 16,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చలేదు..
రెండేళ్లైనా .. ప్రత్యేకహోదా లేదు..
రెండేళ్లైనా .. పోలవరానికి పూర్తి స్ధాయిలో నిధులు లేవు..
రెండేళ్లైనా.. రాజధానికి పూర్తిస్ధాయిలో నిధులు  లేవు..
రెండేళ్ళైనా.. అన్నిటినీ మించి ఎప్పటినుంచో డిమాండులో ఉన్న విశాఖ ప్రత్యేక రైల్వే డివిజన్ కూడా లేదు..


కేంద్రం.. రాష్ట్రానికి ఇచ్చింది ఏంటయ్యా అంటే.. 

1. 2800 కోట్లు అప్పుడోకోంత.. అప్పుడోకొంత..
2. వెనుకబడిన ఏడు జిల్లాలకు.. 350 కోట్లు జిల్లాకి 50 కోట్లు చొప్పున.
3. స్మార్ నగరాలలో రెండు ఏ.పీ నగరాలకు స్ధానం.
4. బిల్లులో పెట్టిన కాలేజీల శంకుస్ధాపనలు అయ్యాయి.. కాని వాటికి బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే.. అరకొరే..
5. రాజధాని నిర్మాణానికి పర్యావరణ  అనుమతులు.
6. రాజధాని శంఖుస్ధాపనకు వచ్చినపుడు ప్రధాని తీసుకువచ్చిన నీరూ..మట్టీ..


రాష్ట్ర ప్రజల తరపున చిన్న విన్నపం: 
అయ్యా.. మోదీగారూ.. వెంకయ్యగారూ.. ప్రత్యేకహోదా ఇప్పించండి.. దానిని ఆసరాగా తీసుకుని మేం కష్ట పడతాం..






No comments:

Post a Comment