రోజూ... టీవీలో... పేపర్లో.. ఈ రోజు మీ అబిమాన బ్లాగులో :D ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది..
కొంతమంది రోజూ టీవీల్లో.. పేపర్లో.. కనిపించక పోతే ప్రజలు వాళ్ళను మర్చిపోతారు అనే భయంతో.. భావి భారత భవిష్యత్తును గురించి ఆలోచించకుండా బరితెగించి మాట్లాడుతున్న పదం ఈ అసహనం..
అధికారం కోసం ఏమైనా చేసే రోజులు ఇవి.. మైకులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు వాగడం.. వార్తల్లోకి ఎక్కడం.. ఈ మీడియాకి కూడా వాటిని తప్ప వేరే వాటిని చూపిస్తే రేటింగులు పోతాయేమో అనే భయం. ఎందుకంటే ప్రజలు కూడా వాటినే ఎక్కువ చూస్తారు కదా...
ఇక ఈ రచయితలకు ఏమైందో ఏంటో.. ఒకవేళ దేశంలో అంత అసహనం పెరిగిపోయింది అనిపిస్తే.. వాటిని అలా కాదు.. ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని వివరించి.. దేశంలో అందరూ సమానులే అని చెప్పి ఒప్పించి, ఆ తప్పులను సరిదిద్దాలి కానీ.. ఏంటి పెద్ద సార్లూ.. ఈ పని అవార్డులు వెనక్కి ఇచ్చేయడం???
మీరు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి వచ్చి.. ఇన్ని అవార్డులు సంపాదించుకొని ఉంటారు..
ఎంతో కలత చెందితే తప్ప.. ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు అని మాకు కూడా తెలుసు సార్.. కానీ ఇదే మంచి మార్గం అంటారా??? ఒకసారి ఆలోచించి చూడండి..
ఒకే మతం వైపు బీజేపీ కనుక అడుగులు వేయతల్చితే.. భవిష్యత్తులో దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు మొరుగుతున్న మీ ఎం.పీ ల నోర్లు ముయ్యండి. అన్ని మతాల సమాహారం మన భారతం..
కాంగ్రెస్.. గృత 10 ఏళ్లుగా దేశాన్ని మామూలుగా మెయ్యలేదు వీళ్ళు.. ఇపుడు అధికారంలో లేకపోయే సరికి ఆకలి వేసి అహంకారంతో.. అసహనం అసహనం అని అరుస్తున్నారు.
ఆపండి ఇక చాలు..
అసహనం ఉండాల్సింది మీకు కాదు..
అసలైన అసహనం ఎవరికి ఉండాలో రేపు మాట్లాడుకుందాం..
దీనిపై మీ ఆలోచనలు కామెంట్లుగా మార్చి మాకు పంపండి. :)
Bjp ni vyatirekiddham anukunte moham meede cheppeyocchu ee mahanubhaavulu. Kaani chepparu. Asahanam ane musugu todukuni natakalu aadutunnaruu. Endariko lakshyalu eina ilanti Awards anni venakki occchestunte, ah award ki maatrame kaadu, ah award tiskuna endharo goppavallu pratistha ki nastam.
ReplyDeleteavunu.. kaani konthamandhi BJP nayakulu kuda Hindu matham perutho ekkuva chesthunnaru. Vallani control chesthe bavuntundhi... Asahanam annadhi keevalam enni kallo voodipoyina naayakullone undhi.. endukante vallu oodipoyaru kabatti.. Mari ee Ameer Khan lanti valla sangathe manaki ardam kavattledu.. anthaga India vidichi vellipovali ante evarina aaputhara vellipovachui kada?? India samanya prajala sommu thintu India gurinchhhi ala matladatam maree darunam.
Delete