మాతృదేశం




ప్రజలు పట్టుదలతో ప్రశ్నిస్తే ప్రభుత్వాలు దిగివస్తై అన్నమాటకి గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు అర్ధంపడుతున్నై.


మొదటిది..

అభివృద్ధి మాకు వద్దు మాకు మా భూమి ఉంటే చాలు అని మచిలీపట్టణం ప్రజలు రోడ్ ఎక్కితే..
అభివృద్ధి వలన జరిగే మంచిని ఆ ప్రాంత శాసనసభ్యుడు.. పార్లిమెంట్ సభ్యులు కలిసి ప్రజలని కలిసి వివరించే ప్రయత్నం చేసారు. ఇంతకుముందు అలా రోడ్ ఎక్కిన వాళ్ళని పోలీసులతో కొట్టిన్చేవాళ్ళు.. ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం మారింది అని చెప్పాలి. ధన్యవాదాలు.


రెండవది.. 

దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి రిటైర్ అయ్యాక సేదతీరుదాం అనుకుంటే.. ఒక్కో సైనికునికి ఒక్కో పించన్ ఇస్తుండడంతో అందరు సైనికులు కలిసి ఉద్యమించారు.. దానితో ప్రభుత్వం దిగివచ్చినది.





             -------------------------------------------------------------------------------------------------------




      రైతు మృత్యు ఘోష 



ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోతున్నై.. అయినా రైతుల కడుపు రోదిస్తూనే ఉంది.

అభివృద్ధి ఇంత జరిగింది అంత జరిగింది అని ప్రభుత్వాలూ.. కార్పొ'రేటు' కంపేనిలు సంకలు గుద్దుకుంటున్నా.. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజల ప్రాణాలు మాత్రం నిలుపలేకపోతున్నై..

ఎంతో మంది మేధావులు తీసుకోవాల్సిన జాగ్రాత్తల గురించి మొత్తుకుంటున్నా.. ప్రతీ విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న అతి పెద్ద తప్పులు కర్షక ఉరి ఊచలుగా మారుతున్నాయి.

మొదటిగా.. టెక్నోలోజి..

టెక్నోలోజి పరం గా దేశం ఎంత పైకి ఎగిరినా రైతుల ఆనంద రాశులకు మాత్రం రెక్కలు తోడగలేకపోతునది.

రెండవది.. రాజ్యాంగం..

ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అని భావించిన ప్రజలు చివరికి పిచ్చివాల్లుగా మారుతున్న దుస్థితి.

మూడవధీ.. వాతావరణం..

లెక్కలేనన్ని తప్పులు మనమే చేస్థూ వర్షాలు కురవట్లేదని భాధపతున్నాం.. ఆ తప్పుల గురించి మళ్లీ మాట్లాడుకుందాం.. 


--------------------------------------------------------------------------------------------------------------------------



రిసర్వేషన్లు

పటేల్లకు ఒబిసి లో స్థానం కావాలి.. 

అందరికి మెదడు ఒక్కటే కదా?? వెనుకబడిన వర్గాలకు సంపాదన కోసం సాయం మరియు మార్గం అడగాలి కానీ.. ఇలా రిసర్వేషన్లు కోసం ధర్నాలు చెయ్యడం ఎంటో??

అంబేద్కర్ సమయం లో ఐతే దేశ ఆర్దిక వ్యవస్థ అంత పటిష్టం గా లేదు కాబట్టి  రిసర్వేషన్లు ఇచ్చారు అనుకోవచ్చు కదా??? ఇప్పుడేమైంది ఎన్నికల్లో విజయం కోసం లక్షల కోట్లు ప్యాఖేజిలు ఇస్తున్నపుడు.. 

మీరు అడగొచ్చు కదా?? మా జాతి వెనుకబడి ఉంది మాకు ప్రభుత్వం తరపునుంచి కొంత సాయం కావాలి అని??? 

అలా అడిగితే సబబుగా ఉంటుంది అంతే కాని మాకు మెదడు కొంచెం తక్కువగా ఉంది కనుక మాకు రిసర్వేషన్లు తప్పని సరి అని రోడ్డు పైకి ఎక్కడం దేనికి???

మారాలి రిసర్వేషన్లు ఉంటే భాగుపడిపోవచ్చు అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు మారాలి..

ఎస్.సి , ఎస్టి వర్గాలకు రిసర్వేషన్లు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయ్.. మరి  అయినా సరే ఇంకా ఆ వర్గాల్లో పూర్తిగా ఎందుకు వెలుగు రేఖలు చిమ్మలేదు??? ఇంకా చాలామంది అమాయకులు ఎందుకు చీకట్లోనే చేతులు చాచి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు??? 

కాబట్టి రిసర్వేషన్లు ఉంటే అన్ని అయిపోవు అని గుర్తించండి.

మీరు ఆర్దికంగా.. సామాజికంగా.. అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాన్ని నీతి యుక్తంగా.. ధర్మ మార్గంలో సాయాన్ని కోరండి తప్పులేదు.                           

                          ---------------------------------------------------



                                     తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు 

       

                                 ఈ రోజే(29-08-2015) ప్రారభించబడినది.. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ధన్యవాదములు.

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు 

తియ్యని తెలుగు భాష..
కమ్మని తెలుగు భాష..
అమ్మ ప్రేమ తెలుగు భాష.. 
దేశం లో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు భాష..

ఇంగ్లిషు అవసరమే.. కానీ తెలుగు భాష అనివార్యం..

No comments:

Post a Comment