చాలా ప్రశాంతంగా.. భవిష్యత్తుపై గంపెడు ఆశల వారధిని మెల్లమెల్లగా నిర్మించుకుంటూ.. తల్లితండ్రులు.. పిల్లలకు బాదలు తెలియనివ్వకుండా.. కష్టపడటం నేర్పిస్తూ.. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యడానికి ఎన్ని కష్టాలైనా పడుతూ.. సమాజంలో సమసమాజ స్ధాపన కోసం వారికి తోచిన సాయం చేస్తూ.. ( వారి పిల్లల్ని సంస్కార వంతులుగా పెంచడం కన్నా తల్లిదండ్రులు సమాజానికి చేసే పెద్ద సాయం ఏముంటుంది చెప్పండి...???)
ముఖ్యంగా పిల్లలకు ఎన్నో ఆశలు ఉంటాయి.. అది కావాలి.. ఇది కావాలి.. అని.. వాటిలో వారికి అవసరమైనవి ఇస్తూ.. కష్టమంటే ఏంటో తెలియజేస్తూ.. ఎన్నో కష్టాలు.. ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న మన లాంటి భారతదేశపు మధ్యతరగతి కుటుంబ సభ్యులకు నా పాదాభివందనం..
బహుశా.. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన వారి కంటే.. మధ్యతరగతి కుటుంబాలలో పుట్టి పెరిగిన వాళ్ళకు కుటుంబ బాంధవ్యాలు.. మానవతా విలువలు.. అదికంగా ఉండవచ్చు. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి... వాటిని వివరించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం..
నిన్నటి నుంచి నేరుకుంటూ...
ఈ రోజుని ఆస్వాదిస్తూ...
రేపటిపై ఆశతో...
ముందుకు సాగుతున్న ఈ మధ్యతరగతి కుటుంబాలలో అమ్మా.. నాన్నా.. తాతా.. మామ్మా.. అమ్మమ్మా.. అందరివీ చాలా విశిష్టమైన పాత్రలు.. ఆ పాత్రల మధ్యలో అప్పుడప్పుడే తమ పాత్రకు ప్రాణం పోసుకుంటూ.. రేపటి భారతదేశాన్ని నిజాయితీతో శాసించడానికి సన్నద్దమవుతున్న మధ్యతరగతి మహానుభావులారా(పిల్లలారా) రండి.. మీలోని నిజాయితీ.. ధర్మం.. సంస్కారాల కోసం భారతదేశం ఎదురుచూస్తోంది...
No comments:
Post a Comment