Monday, 30 November 2015

వాతావ'రణం' మన పైన మనమే..

భూమి, మరే గ్రహంలోనూ లేని ఆహ్లాదకరమైన.. మానవుడు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం... మానవుడికి కావాల్సిన గాలి, నీరు ఇస్తూ... ఒక్క క్షణం కూడా ఆగకుండా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచీ తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ తిరుగుతూ.. అలసట లేకుండా కోట్లాది జీవరాసులను తన హక్కున చేర్చుకుని.. పంచభూతములనూ సమానంగా పంచుతూ.. మా మంచి జీవితాలను ప్రశాంతంగా గడపడానికి కారణమైన ఓ ధరణీ నీకు మా పాదాభివందనం.

నిన్ను మేము ఎన్నో బాధలకు గురిచేస్తున్నాము.. అయినా సరే మాకు పెట్రోలియం బావులు తవ్వుకోడానికి ఇచ్చావు. నీలో బోరు తవ్వితే వాడుకోడానికి వాటర్ ఇస్తున్నావు.. ఎరువుల మందులు కొట్టి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. తినడానికి తిండి ఇస్తున్నావు.. నీలో పునాది రాయి వేసి ఇల్లు కట్టుకుంటే ఉండడానికి చోటు ఇస్తున్నావు.. ఆఖరికి మేము అంతరించిన తరువాత నీలో కలిపేసుకుంటున్నావు.

నువ్వు మాకు నిస్వార్ధంతో ఇన్ని చేస్తుంటే.. మేము మాత్రం we need more అంటున్నాం.

"Earth will give what we need.. not what we want.." ఇది మనం ఎప్పుడు తెలుసుకుంటామో.. అప్పటి నుంచే భూమికి.. మానకీ మంచి రోజులు. అప్పటివరకూ దినదిన గండమే..

ఆ మంచి రోజుల వేట NOV 30 నుంచి DEC 11 వరకు జరిగే UNITED NATIONS CONFERENCE ON CLIMATE CHANGE తో మొదలవ్వాలని కోరుకుందాం.
http://www.cop21.gouv.fr

ఈ భూమి మనకి ఎన్నో ఇచ్చింది.. మనం ఏమీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మన భూమిని కావాడుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉంది.

భూమికీ.. మనకీ మంచి రోజులు మన చేతిలోనే..
(మనం చేసే పనులకి భూమికి చిరాకు వచ్చి తిరగడం ఆపేస్తే???) కాబట్టి భూమికి చిరాకు రప్పించే పనులు చెయ్యడం తగ్గిద్దాం.

No comments:

Post a Comment