Thursday, 23 July 2015

ఈ రోజుల్లో ఏదోకటి ఆశించే వాళ్ళు ఎక్కువ..



HAPPY BIRTHDAY


1.బాలగంగాధర తిలక్(జూలై 231856 - ఆగష్టు 11920): ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు 


2.చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 231906 – ఫిబ్రవరి 271931)తనను విచారిస్తున్న బ్రిటిష్ న్యాయాధికారి ఖరేఘాట్‌కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది- ‘‘నీ పేరేమిటి?’’ ‘‘ నా పేరు అజాద్,’’ ‘‘ తండ్రి పేరు’’ ‘‘స్వాధీన్,’’ ‘‘నీ ఇల్లెక్కడ’’ - ‘‘కారాగృహం.’’ ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. కోర్టులో సందర్శకులనుంచి ‘్భరత్ మాతాకీ జై’ నినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుగారే ముఖవర్చస్సుకల ఆ బాలుడిని చూస్తూ కూడా అధికార దర్పంతో ‘16 కొరడాల దెబ్బలు’ అంటూ శిక్ష ప్రకటించాడు.నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే.. ఆ బాలుని శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినపుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటున్నాడు. ఆనాడు కాశీ ప్రజలు ఆ బాలుని ‘అజాద్’ అని పిలిచారు.
#WIKI




No comments:

Post a Comment