ఇది మంచి ఆలోచన అనడం కంటే.. ఇది మనందరి అనాలోచిత పనుల వలన అంటే బాగుంటుంది. ఎందుకో ఒకసారి చూద్దాం..
పూర్వం ఒక సామెత ఉండేది.. నోరు మంచిది అయితే.. ఊరు మంచిది అవుతుంది.. అని. అలాగే ఎవరి ఇల్లు వాళ్ళు శుబ్రంగా ఉంచుకుంటే.. ఊరంతా శుభ్రంగా ఉంటుంది. దీనిని బాగానే అనుసరిస్తున్నాం... ఎలా అంటారా?? మన ఇంట్లో చెత్త తీసుకుని వెళ్లి రోడ్డు పైన పోస్తున్నాం కదా.. అలా..
మళ్ళీ మనమే రోడ్డు పైన వెళుతూ.. ఛీ.. ఛీ.. కంపు.. యాక్ వాసనా.. అని ముక్కు మూసుకుంటాం.
గ్రాములలో అయితే కొద్దిగా పర్లేదు. స్మార్టు సిటీలుగా చెప్పుకునే సిటీలకు వెళితే.. అవి స్మార్టు సిటీలా.?? స్మెల్లు సిటీలా అనిపిస్తుంది. దీనికి బాధ్యత ఆ స్మెల్లు సిటీలో ఉండే ప్రతీ ఒక్కరిదీ..
మా నాన్న గారు ఎప్పుడూ ఇక మాట అంటూంటారు " చదువుకున్న వాడి కంటే చాకలివాడు నయం" అని. అది నిజమే అని మీకు కూడా తెలుసు అనుకుంటా??? అనుకుంటా ఏంటి తెలుసు లేండి.. హ.. హా..
కానీ ఒక ఉదాహరణ( కించ పరచడం నా అభిమతం కాదు. కేవలం తెలుసుకుంటారు అని మాత్రమే. మన మంచి కోసమే) చెబుతాను వింటారా..
బ్యాచులర్ జీవితాలు తెలుసుకదండీ.. రూమ్ లో ఉంటాం.. ఎప్పుడు ఏది కావాలన్నా బయటకి వెళ్ళి తెచ్చుకొవాల్సిందే.. దానిలో భాగంగానే ఒక ఆదివారం రోజు మధ్యాహ్నం భోజనం తినే వేళ అయింది. నేను కుక్కరులో అన్నం పెట్టాను. ఇంతలో స్నేహితుడు "ఏం కూరలు తీసుకొని రమ్మంటావు" అన్నాడు. " ఏదొకటితే" అన్నాను ( ఏ గడ్డి అయినా ఒకటే కదా). "సరే" అని బయలుదేరాడు. ఇంతలో నేను " ఇదిగో ఈ కవరు తీస్కోని వెళ్లు" అని కవరు ఇచ్చా.. ఆ సమాధానం మనందరిలానే వచ్చింది. "ఎందుకు మోసుకుని వెళ్ళడం?? వాడు ఇస్తాడు కదా.." అపుడు " సరే వెళ్లు" అనుకున్నా. ఇంకేం అంటాం మాస్టారూ???
అందుకే స్మార్టు సిటీలుగా ఉండాల్సిన నగరాలు.. స్మెల్లు సిటీలుగా కంపు కొడుతున్నాయి.
చదువుకోని వాళ్ళకి తప్పు అని తెలియక చేస్తారు.. చదువుకున్నాం అనుకున్నవాళ్ళు మనం చేసేది తప్పు అని తెలిసి కూడా చేస్తారు.
మనమే వేల కోట్లు ఖర్చు పెట్టి.. చెత్త వెయ్యకండ్రా వెదవల్లారా అని చెప్పించుకుంటున్నాం.. ఎందుకంటే మనకి తెలియదు కదా..
ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చినందుకు మనమందరం సిగ్గు పడాలి.
ప్రతీ చిన్న చిన్న ఆలోచన.. రేపు ఎన్నో మార్పులు తీస్కొస్తుంది.. అది మనతోనే సాధ్యం.
కవర్లు ఉపయోగించ వద్దు. రేపటి ప్రకృతి కోసం.
ఓపికగా చదివినందుకు ధన్యవాదములు. 😊
Nice article..
ReplyDelete