Sunday, 29 November 2015

బడుగు బలహీన వర్గాలు


ఈ మాటలు ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా విని ఉంటారు కదా..??? అవును వారు గుర్తొచ్చేది ఓట్ల కోసమే కదా.. ఎన్నికల తర్వాత విజయోత్సవ యాత్రలూ.. వాటి తర్వత ఆచూకీ కన్పించట్లేదు అనే బోర్డులు..

68 ఏళ్ల భారతదేశపు స్వాతంత్ర్యం.. ఎందరో ప్రధానమంత్రులూ.. మరెందరో ముఖ్యమంత్రులు పరిపాలిస్తూనే ఉన్నారు. బలహీన వర్గాలు అనే పదాన్ని ఇంకా వాడుతూనే ఉన్నారు.. ఇంకెప్పుడు???

ఆ పదానికి చరమగీతం పాడే ఉద్దేశం లేదా..??? రాజ్యాంగంలో అంతా సమానంగా పైకి రావాలని రాసినా.. సగం కంటే తక్కువే వచ్చి ఉంటారు. మిగిలిన వారంతా ఆ పదంతోనే సావాసం చేస్తున్నారు.

బలిసిన వర్గాలే ఇంకా బలపడుతున్నారు కానీ.. బలహీన వర్గాలు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా ఎన్ని ప్రభుత్వాలు?? ఇంకా ఎన్నేళ్లు..?? ఎలక్షన్ల తర్వాత ప్రజల దగ్గరకి ఎప్పుడు వస్తారు?? మీ డబ్బు ఆకలి ఎప్పుడు తీరుతుంది?? మీ డబ్బు ఆకలి ముందు అన్నం లేక ఆకలి చావులు చస్తున్న ప్రజల ఆకలి చాలా తక్కువ సార్.. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికీ ప్రతీ మూడున్నర సెకండ్లకు ఒక ఆకలి చావు నమోదవుతుంది..

ఇంతకంటే బలహీన వర్గాల బాధల గురించి ఏం చెప్తాం చెప్పండి..

రేపు ఒక సారి ప్రపంచం వైపు వెళ్ళి వద్దాం.. చాలా ముఖ్యమైన విషయం..

No comments:

Post a Comment