గత కొన్నేళ్లుగా విచ్చిన్నమైన ఇంజినీరింగు విద్యావిధానాలు యువత భవిష్యతును పాతాళం లోకి తోక్కేస్తున్నై.
ఆ కారణంగా ఇంజినీరింగు చేసిన యువత చదివింది ఒకటైతే.. చేసే ఉద్యగం మాత్రం ఒకటి అవుతుంది.. ఇది కుడా కేవలం 30% యువత మాత్రమే. మిగిలిన 60% దిక్కుతోచని స్థితిలో ఊరూరా తిరుగుతూ.. ఇరుగుపొరుగు వారు అడిగే అతి దారుణమైన ప్రశ్న " ఎం చేస్తున్నావు" కి భయపడి ఇంటికి వెళ్ళడం కుడా మానేసి.. పట్టణాలలోని ఉపాది శిక్షణా కే0ద్రాలకి.. వసతి గ్రుహాలకీ.. మధ్య నలిగిపోతున్నారు.
బహుసా మోది ఆలోచన మనలాంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కావొచ్చు.. చూద్దమ్.. మంచి జరగాలని కోరుకుందాం..
ఇదిలా ఉంటే ఇంజినీరింగు విద్యావిదానాన్ని ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం కాదు కాదు అత్యంత అవసరం ఎంతైనా ఉంది.. మన విద్యా విధానాల వలన యువత అవకాశాలు అందిపుచుకోలేక.. అమ్మానాన్నల జీవితాల్లో వెలుగులు నిమ్పలెక.. చతికిలపడిపోతున్నారు. ఆర్దికంగా బలంగా ఉన్న మిగిలిన 10% మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసమ్ విదేశాలకి తప్పక రెక్కలు లేకపోయినా ఎగరాల్సి వస్తుంది. అవే అవకాశాలు ఇక్కడ కల్పిస్తే మన ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడే అవకాసం లేకపోలేదు..
ఒకసారి రెండో వైపు కుడా చూద్దాం.. తను ప్రపంచం అంతటికి పొట్ట నింపుతున్నా.. తన పొట్ట నిమ్పుకూడానికి తిండి లేక.. తన కుటుంబాన్ని పోషించలేక.. అప్పుల బాధ అనుభవించలేక.. ఆర్ధికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్న మృత్యు ఘోష మీకు వినపడటం లేదా మోదిజీ..??? పంట బాగా పండినా ఆత్మ హత్యాలు ఆగట్లేదు. విమర్శిస్తున్నాను అనుకూకపోతే.. బీహార్ ఎన్నికల్లో విజయం సాదించడం కోసమ్ 1.50 లక్షల కోట్లు ప్రకటించారు.. మరి రైతులు మృత్యువు ని జయించటానికి మీదగ్గర ఉన్న ఆలోచనలు ఏంటి??? కనీసము "మాన్ కి బాత్" లో ఒక్క మాట చెప్పి అయినా మన రైతుల మనస్సులో ఆశ రేపించండి.
స్మార్ట్ సిటీలు అని ఒక్కో నగరానికి 100 కోట్లు ఇస్త్నారు.. మరి రైతుల బాధలు మీకు పట్టవా?? వారి కుటుంబాలు రోదనలు మీకు పట్టవా?? ఒక్కో నగరానికి మీరు ఖర్చుపెడుతున్న 100 కోట్లు ఎం అవుతున్నాయి మీకు తెలియదా..??? మింగేస్తున్నారు సార్ మింగేస్తున్నారు. అదే డబ్బు రైతు సంక్షేమానికి ఇచ్చి ఆ కుటుంబాలలో ఆనందాన్ని చుడండి. అక్రమంగా మీసే వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళ ఆకలి తీరదు.. అదే రైతన్నకు పెట్టి చుడండి ఇంకో పది మంది పొట్ట నింపి చూపిస్తాడు.
ఇస్రాయిల్ వంటి దేశాలు ఎడారుల్లో పంటలు పండిస్తునాయి. మన దేశంలో వర్షాలు పడుతున్నా రైతు పంట పండించలేకపోతున్నారు .
దయచేసి మీ అడుగులు రైతుల సమస్యల పరష్కారం వైపు వేయాలని ఆశిస్తున్నాం..
No comments:
Post a Comment