మన దేశ అభివృద్ధి చైనాని మించిపోయింది. మన నాలుగు సింహాలూ.. డ్రాగన్ కు పంజా విసురుతున్నాయి. గత కొద్ది రోజులుగా తీసుకుంటున్న సంస్కరణలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి.
ఈ ఫలితాలు భూమికి మాత్రం బారంగా మారుతున్నాయి. అభివృధ్ది అడుగడుగునా భూమికి తలొంపులు తెచ్చిపెడుతుంది. ఈ అభివృద్ధి కోసం పెడుతున్న పరిశ్రమలు భూతాపాన్ని పెంచేస్తున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు భూమిని ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తున్నాయి. దానితో భూమికి భూతాపం మరింత భారం అవుతుంది.
ఎవరో కొందరు బడా పారిశ్రామిక వేత్తలు చేస్తున్న తప్పులకి.. భూమినీ.. వాతావరణాన్నీ.. నమ్ముకొని బతుకుతున్న రైతన్న బలైపోతున్నాడు.
ఈ భూతాపం పేద రైతుల పాలిట శాపంగా మారిపోయింది. ఇదివరకు జూన్ మొదటి వారంలో వర్షాలూ.. రెండో వారంలో విత్తనాలు.. మూడో వారంలో కలుపుమందూ.. ఇలా చాలా ఆనందంగా పనిలో నిమగ్నమై ఉండే రైతన్నలు, ఈ భూతాపం వలన ఆగస్టు వరకూ వర్ణుడి కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉండిపోవలసి వస్తోంది.
భూతాపాన్ని పెంచుతున్న ఈ అభివృద్ధి దేనికి సంకేతాలు పంపుతోంది??? రైతన్నలు ఇక పంటలు వెయ్యొద్దనా??? లేక.. సొంత భూములు వదులుకుని పొట్ట చేత పట్టి పట్నం పొమ్మనా..???
భూతాపాన్ని తాళలేక బీటలు వారుతున్న భూమి... ఆ బీటల మధ్యలో నలిగిపోతున్న రైతు కుటుంబాలు.. ఎవరు కారణం..???
ఎవరికి వారు వాతావరణాన్ని కాపాడటానికి మా వంతు సాయం చేస్తాం.. అని చెబుతున్నారే కానీ.. మేం తీసుకుంటున్న ఈ చర్యలు ఇలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పే వాళ్ళే లేరు..
వేదికలపై ప్రసంగాలది ఏముంది.. మహా అయితే విలేకరులు అడగటానికి ఒక ప్రశ్న ఉంటుంది..
అదే ప్రకృతిని కాపాడి చూడండి.. "హా.. నేను బతకగలను" అనే బరోసా భూమికి కలుగుతుంది.
మన బరోసా కోసం భూమి ఎదురు చూస్తోంది.
No comments:
Post a Comment