పేద వారికి బుల్లి తెరే.. 70mm.. I max..
అటువంటి టీవీని కూడా వారికి దూరం చేసేస్తుంది ఈ డిజిటలైజెషన్...
Set top box తప్పని సరి అనేసరికి.. రెచ్చిపోతున్నారు.. అమ్మే నా యాళ్ళు(సెన్సార్ అయినా తప్పదు వాడాలి). చైనా నుంచి బ్లాక్ లో 200-300 కి (ఖచ్చితంగా తెలియదు కాని ఇంత ఉండొచ్చు) దిగిమతి చేసుకుని.. ఇక్కడ ఆనందానికి అలవాటు పడ్డారు కదా చచ్చినట్టు కొంటారులే అనుకునే వాళ్ళని ఇంత కంటే మంచి సంబోదించమంటారా చెప్పండి???
ఒక్క set top box విలువ 1100 - 3000 రూ...
ఇది తప్పనిసరి.. డిసెంబరు 30 ఆఖరి గడువు..
అంటూ ప్రకటనలూ.
ప్రకటనలలో పాల్గొంటున్న యాక్టర్లూ.. ఏ.. మీరూ కష్టపడే పైకి వచ్చి ఉంటారు కదా??? మీకు తెలియదా??? అంతంత రేట్లు పెట్టి సామాన్య ప్రజలు కొనలేరు అని???
ఒకటి అర్ధం కాక అడుగుతున్నా.. అవసరం లేని (ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది) అడ్డమైన కేసులు వేసే లాయర్లూ... నిద్రపోతున్నారా??? ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మి.. కొనలేని కుటుంబాల ఆనందాలను హరిస్తుంటే.. ఏం చేస్తున్నారు???
ఆ డబ్బు కట్టలేనివారి పరిస్తితి ఏంటి???
టీవీ ఛానల్ యాక్టర్లూ.. యజమానులూ... బాగానే సంపాదిస్తున్నారు కదా.. మీరు కొనివ్వరాదూ??? సామాజిక భాద్యతగా తీసుకుని???
ఎవరు కొనిస్తే వారి ఛానలే చూస్తాం అంటే కొనిస్తారేమో...???
No comments:
Post a Comment