Thursday, 5 May 2016

What are the qualifications to get Special category Status..???



అసలు ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఏ ఏ అంశాలను పరిగణంలోనికి తీసుకుంటారో చూద్దాం.. 

1.Hilly and difficult terrain
2.Low population density
3.Strategic locations along the borders of the country
4.Economic and infra backwardness
5.Non-viable nature for state finances.

మొదటి మూడు అంశాల పరిగణంలోనికి మన రాష్ట్రం రాకపోయినా.. 4 మరియు 5 అంశాలు స్పష్టంగా చెప్తున్నాయి.

అవేంటంటే..ఏదైనా రాష్ట్రం ఆర్ధికంగా మరియూ ప్రాధమిక మౌళిక సదుపాయాలు లేకుండా అవస్ధలు పడుతుందో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించొచ్చు.. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆపాదించి చూస్తే.. విభజన అయిన మొదటి ఏడాదే 16 వేల కోట్ల ఆర్ధిక లోటు, దీనికి తోడు 24 వేల కోట్ల రైతు మరియు డ్వాక్రా రుణ మాఫీ.నెల చివర వస్తుందంటే ఉద్యోగుల జీతాలకు డబ్బులు ఎక్కడ నుంచి తేవాలో తెలియని పరిస్థితి, దీనికి తోడు ప్రక్క తెలంగాణాలో ఉద్యోగులకు 43% జీతాలు పెంచడంతో.. ఆంధ్రప్రదేశ్ కూడా పెంచక తప్పని పరిస్థితి.
సంక్షేమ పథకాలకు డబ్బులు కరవు, దీనికి తోడు రాష్ట్ర విభజన సందర్భంగా.. అప్పులను జనాభా ప్రకారం విభజించి.. రాబడిని ప్రాంతాన్ని బట్టి విభజించారు.

ఇక మౌళిక సదుపాయాల విషానికి వస్తే..
ఏదైనా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండే రాజధాని లేదు.. దీంతో అంతా వేళ్ళ నుంచి మొదలుపెట్టాల్సిన దుస్థితి.

ఇక 5వ అంశానికి వస్తే..మార్పలు లేని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు.

కొత్త రాష్ట్రం.. ఎక్కువ ఆదాయం వచ్చే హైదరాబాదు తెలంగాణాకు వెళ్లింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం లేకుండా పోయింది. కనుక ఆదాయ వనరులు వెతుక్కుని రాజదానిని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలూ.. ప్రభుత్వం పడుతున్న ఈ బాధలు చాలవా.?? ప్రత్యేక హోదా ఇవ్వడానికి.??



No comments:

Post a Comment