సామాన్య మానవుడు :- " ఏం కావాలి మీకు?? సామాన్యుల ప్రాణాలు తీసేస్తె మీకు కావలసింది వచ్చేస్తుందా??? అసలు ఏం కావాలి మీకుచెప్పండీ... డబ్బులా??? అధికారమా??? సమాజంలో చోటా??? ఏం కావాలి మీకు.. హా???
ఏది కావాలన్నా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం. మా ఆలోచన ఏంటంటే మీరు కూడా మాలాంటి మనసున్న సామాన్య మనుషులని. మీరు కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటారు. కుటుంబంతో దూరంగా ఉంటూ.. సమయానికి తిండి లేక..
మీలానే సమాజంలో ప్రతీఒక్కరకీ ఒక కుటుంబం ఉంది. మీరు ఇష్టా రాజ్యంగా చంపేస్తుంటే.. రేపు ప్రభుత్వ దళానికి మీ కుటుంబమూ చిక్కొచ్చు. అప్పుడు మీరు బాధ పడినట్టే.. మీ చేతిలో చనిపోయినవారి కుటుంబ సభ్యులూ అంత కంటే ఎక్కువే బాధపడుతారు.. ఎందుకంటే సామాన్య సమ సమాజంలో ప్రేమాభిమానములూ.. మానవత్వాలూ.. ఎక్కువ.
ఒక్కసారి ఆయుధాలు విడిచి కుటుంబంతో సమ సమాజంలో వచ్చి జీవించి చూడండి. మీలో మార్పు వస్తుంది. ఒక వేళ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం.. ఏం చెయ్యాలో. మీరు ఎక్కడో ఎడారుల్లో.. అడవులలో.. ఒంటరిగా పడుతున్న కష్టాలకంటే.. ఈ సమాజంలో పడాల్సినవి చాలా తక్కువ..
ఎవరో కొందరి అమానుష ఆలోచనల వలన బాదితులుగా మారి మిమ్మల్ని మీరు ఆత్మాహుతి చేసుకోవడం మాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఎవరి కోసమో మీరు చనిపోవడం ఏంటండీ.. మాకు అర్ధం కావట్లేదు.. మీకు కూడా తలా దానిలో మెదడు ఉన్నాయి కదా.. ఆలోచించి చూడండి సార్లూ.. మహా అయితే బ్రతికేది 80 ఏళ్ళ... ప్రశాంతంగా.. ఆనందంగా.. కుటుంబ సభ్యులతో గడపాల్సింది పోయి.. ఏంటి మాస్టారూ ఇది???
రండీ.. సమసమాజంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం...
ఇక్కడ కూడా తప్పులు జరుగుతాయి... వాటిని ధైర్యంగా ధర్మంతో తిప్పి కొడదాం.. రండీ..
No comments:
Post a Comment