Thursday, 26 November 2015

అసహనం - ఎవరికి ఉండాలి???

డైరెక్టుగా పాయింటులోకి వెళ్ళిపోదాం..

అయిదారు నెలలు ఎండనకా.. వాననకా.. రేయనకా.. పగలనకా.. కష్టపడి పొలం దున్ని.. విత్తనం నాటి.. పంట చేతికి వచ్చాక.. అది తీసుకుని మార్కెట్టుకు వెళితే.. అక్కడ రాబందులలా ఎదురుచూసే దళారీలు, రైతుల కన్నీటి కష్టాలను పీక్కుతింటుంటే..
     ఆ రైతన్నకు ఉండాలి అసహనం.. దళారీలపైన..
     ఫ్రీగా ప్రజల సొమ్ము దొబ్బి తినే మీకా??? అసహనం దేశంపైన..???

కొడుకు పుట్టినరోజు దృవీకరణ పత్రం కోసం.. ఒక మధ్య తరగతి తండ్రి అన్ని ఆధారాలూ సరిగా ఉన్నా... 3000 లంచం ఇస్తే తప్ప తన కొడుకుని పై చదువులకు పంపలేడు..
      ఆ తండ్రికి ఉండాలి అసహనం.. ఆ అధికారుల పైన..
      నొక్కేసిన సొమ్ముతో మీ పిల్లకాయలను విదేశాలలో చదువించుకునే మీకా అసహనం.. మన భారతం పైన???

కేజి కందిపప్పు 200.. కేజి ఉల్లిపాయలు 100.. ఏ పాపం ఎరుగని పేదలు తిడి తినలేక పోతుంటే..
      ఆ యజమానికి ఉండాలి అసహనం.. ప్రభుత్వాలపైన..
      కోట్లకు కోట్లు నల్లధనం లెక్కపెట్టుకునే మీకా అసహనం.. దేశంపైన???

మమ్మల్ని గెలిపిస్తే.. మీ అసరాలు తీరుస్తాం అనే నాయకులు.. విజయం సాదించాక.. ఆ ఓటరుకి మీ ఆచూకీ కూడా తెలియనపుడు..
      ఆ ఓటరుకి ఉండాలి అసహనం.. నాయకులపైన..
       గెలిచాం కదా.. ఇక మేసేద్దాంలే.. అనుకునే మీకా అసహనం మన భారతం పైన???

రోజూ టీవీలో.. భారతదేశపు డెంటిస్టులచే సూచించబడే మొట్టమొదటి బ్రాండ్.. *****... ఈ బాధ బరించలేక ఏళ్ళ తరబడి వాడినా డెంటిస్టుల దగ్గరకి వెళ్తే...
      ఆ వినియోగదార్లకు ఉండాలి అసహనం.. ఆ బ్రాండ్లపైన..
      ప్రజల బాధలు ఎలాగో మీకు పట్టవు.. కనీసం ఇలాంటి వాటిపైన అసహనం వ్యక్తం చేసి ఏడవండి.

ఇక ఈ అవసరం లేని నాయకులు.. అనవసరంగా వ్యక్త పరిచే అసహనానికి పాడేద్దాం చరమగీతం.. లేకపోతే మన కాలానికి చెల్లించుకోక తప్పదూ భారీ మూల్యం..

ధన్యవాదములు
ఇంకా ఉపయోగపడే అసహనాలు ఏమైనా మీకు తెలిస్తే తప్పక కామెంట్ చేస్తారు కదూ.. :)

ఇక రేపు మరో విబిన్న విషయంతో కలుద్దాం.

3 comments:

  1. Technical graduation chesi kuda professional jobs kosam ameerpet lo courselu chesi job lu leka khaliga thiruguthunna vaallaki vundali ASAHANAM... AC rooms lo kharidaina illallo thirigey meeky kaadu... mudu putala haaiga bhonchesthunna meeku kaadu puta gadavataniki kuda kastam ga vundey vaallaki vundali ASAHANAM... Medhavulani cheppukuney meeku kaadu medhassuni penchukotaniki nirupinchukodaniki dabbulu ma parents kastanni thagalesthunna maku vundali asahanam...

    ReplyDelete
    Replies
    1. కేవలం అధికారం లేక వచ్చిన అసహనం ఇది.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete