Friday, 11 December 2015

కన్నీళ్ళు కారుస్తున్న నీళ్లు

ఉదయం లేస్తే పళ్ళు తోముకోవడానికి పేస్టు..
తర్వాత ఉదయపు పలహారం తినే ముందు చేతులు కడగటానికి lifeboy hand wash..
స్కూలుకో..కాలేజీకో..ఆఫీసుకో.. వెళ్ళే ముందు సబ్బూ..షాంపూతో.. head bath..
బట్టలు ఉతకడానికి పనికి రాని surf లూ..

ఏంటి.. వీటన్నిటికీ.. నీళ్ళు కన్నీళ్ళు కార్చడానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా..??? ఈ క్రింద అతికించిన చిత్రం చూడండి మీకే అర్ధం అవుతుంది.

మనం చేసే ప్రతీ పనికీ బలి అవుతుంది నీరే.. శుభ్రత పేరుతో జలజలా పారాల్సిన నీటిని, రకరకాల రాకాసి రసాయనాలతో కలిపి భూమిలో ఇంకనివ్వకుండా చేస్తున్నాం.. చివరికి ఆ నీటి పరిస్థితి ఎలా ఉంది అంటే.. మనం worstగా వాడేసి outlet ద్వారా బయటికి పొమ్మంటున్నాం.. సరేలే కదా అని బయటకి వెళ్తే.. నువ్వు కంపు కొడుతున్నావు.. నిన్ను నేను నాలో కలుపు కోను అని భూమి ఛీ కొడుతుంది.

మరి, ఆ నీళ్ళు కన్నీళ్ళు కార్చక ఆనంద భాష్పాలు కారుస్తాయా చెప్పండి..???

పాపం మురికి కాలువలో.. ఎటు వెళ్ళాలో తెలియక(కవర్ల వలన), అటూఇటూ చూస్తూ.. బిక్కుబిక్కు మంటూ.. దిక్కుతోచని స్థితిలో చావాలో బ్రతకాలో తెలియక జీవనం సాగిస్తున్నాయి. మనం పెడుతున్న కష్టాలకి అవి నరక యాతన అనుభవిస్తున్నాయి.

ఈ బాధలు సరిపోవు అన్నట్లుగా.. తెలియక దారి తప్పి రోడ్ల పైకి వస్తే.. ఛీ.. కంపూ.. అని ముక్కు మూసుకుంటున్నాం..

రేపు చూద్దాం ఏమేం.. చేస్తే.. నీటినీ దానితో పాటూ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో..

మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉంటే తప్పకుండా comment చేస్తారు కదూ..

అంతవరకూ సెలవు.. నమస్కారం _/\_

No comments:

Post a Comment