Saturday, 12 December 2015

ఇది జరిగినపుడే..!!! నీరూ.. భూమీ మిత్రులు..

ముందు సుప్రీంకోర్టులో ఒక కేసు వేయాలి.. ఎవరిపై అనుకుంటున్నారా???

అదే లేచింది మొదలు, పడుకునేంత వరకూ మనం వాడుతున్న రసాయనాలు తయారు చేస్తున్న కంపెనీల పైన..

మొదటి త్రైమాసికంలో 20% వృద్ధిరేటు.. రెండో త్రైమాసికంలో 30% వృద్ధిరేటూ.. అని ఆయా కంపెనీలు నమోదు చేస్తున్న వృద్ధిరేటును ప్రచార చిత్రాలలో ఊదరకొడతారు.

అంతేకానీ.. మా రసాయనాలు వలన మొదటి త్రైమాసికంలో మన ప్రకృతికి ఇంత నష్టం జరిగిందీ.. రెండో త్రైమాసికంలో ఇంత నష్టం జరిగింది అని మాత్రం చెప్పరు.

మద్యపానం..ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎలా ప్రచారం చేస్తున్నామో.. అలానే..
మా రసాయనాల వాడకం భూమికి భారం అని పెట్టి తీరాల్సిందే అని కేసు వెయ్యాలి..

ఒకవేళ దీనికి వారు వ్యతిరేకం అయితే.. సుప్రీంకోర్టు వారిచే ఏర్పాటు చేయబడ్డ రసాయన పరీక్షా కేంద్రంలో వారి వస్తువులను పరీక్ష చేయించి.. అవి ఎటువంటి ప్రకృతి హానీ చేయవు అని తేలితేనే.. మార్కెట్లోకి విడుదల చేయాలీ అనే నిబంధన పెట్టాలి..

మరీ ఇంత దారుణంగానా??? అని కంపెనీలూ.. ఇది అసలు జరిగే పనేనా??? అని ఇది చదివే మీరూ.. అనుకున్నా.. ఇది తక్షణం జరిగి తీరాలి.

లేకపోతే 2020 నాటికి 1.5 డిగ్రీల భూతాపం కాదుకదా.. 0.5 డిగ్రీలు కూడా తగ్గించలేం. ఇది సుస్పష్టం. ఒక్క అయిదేళ్ళు మీ కంపెనీలకు వస్తున్న ఆదాయాన్ని, భూమికి ఎటువంటి హానీ జరుగని వస్తువుల తయారీ పై పెట్టండి.. ఆ తర్వాత మీ కంపెనీకి వచ్చే ఆదాయాన్ని లెక్కపెట్టుకోవాలంటే మీకు ఇంకో పదేళ్ళు పడుతుంది.

ఎందుకంటే మన భారతీయులకు భూమి పై ఉన్న ప్రేమ అలాంటిది మరి.

No comments:

Post a Comment