పంజరంలో ఉన్న చిలుకను ప్రకృతిని ఆస్వాదించి రమ్మంటే.. అది మళ్ళీ రాదు.. తనకు ఒక తోడు వెతుక్కుని పిల్లా పాపలతో ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జీవిస్తుంది..
అదే ఒక మృగాన్ని బోనులోనుంచి అడవిలోకి వదిలితే.. ఆహారం కోసం వేట మొదలెడుతుంది.
కట్ చేస్తే.. ఈ రెండిటిలోనూ ఉన్నది స్వేచ్ఛ ఒక్కటే.. కాకపోతే జాతులను బట్టి అవి వ్యవహరించాయి అంతే..
ఏదైనా ప్రాణం విలువ అపారం.. అలాగే మనిషి కూడా.. కాకపోతే మనిషి విషయంలో స్వేచ్ఛ దేనికైనా సహకరిస్తుంది.. అది కొన్ని జీవితాలను నిలబెట్టడానికి ఐనా.. మరి కొన్ని జీవితాలను పడగొట్టడానికి ఐనా..
అదెలా అంటే.. మనిషి దగ్గర మనసు అనే మహత్తరమైన మర్మం ఒకటి ఉంది.
అదే.. గాంధీజీనీ ఇంకా ఎందరో మహానుభావులనూ.. జైలు గోడల మధ్య ఉన్నా.. స్వతంత్రోధ్యమాన్ని నిర్విరామంగా కొనసాగించేలా చేసింది..
అదే.. టాటా, బిల్ గేట్స్, బఫెట్, సత్య నాదెండ్ల, సుందర్ వంటి వాళ్ళను వ్యాపార దిగ్గజాలుగా నిలబెట్టింది..
అదే.. రైతన్నకు అప్పులు మిగిలినా తిరిగి మళ్ళీ వ్యవ'సాయమే చెయ్యి అని చెబుతోంది..
అదే.. వీరప్పన్, లాడెన్, దావూద్లను మృగాలుగా కళ్ళు మూసుకుపోయి నడిచేలా చేసింది..
ఒకే మనసూ.. ఒకే స్వేచ్ఛా.. కానీ పరిణామాలు మాత్రం ఇన్ని విధాలు..
మనసు మనిషి మాట అస్సలు వినదు.. సాధనతోనే మనం మన మనస్సుని దారిలోకి తెచ్చుకోవచ్చు.
అపుడు బిల్ గేట్స్ ఐనా.. బిన్ లాడెన్ ఐనా.. లేక అంతకుమించి మీ పేరే ఐనా.. ఆశ్చర్య పడాల్సంది ఏమీ లేదు.
ఇక మీ ఇష్టం..
No comments:
Post a Comment