చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇదే నిన్న నిర్భయ వ్యవహారంలో జరిగింది.
ఈ విషయంలో కోర్టుని తప్పుపట్టాల్సిన అవసరంలేదు.
మనుషులు మనీ'కి అనుగుణంగా మారిపోతారు.. చట్టం అలా కాదు, కానీ ఈ మధ్య చట్టాన్నీ.. చట్ట సభల ద్వారా చీల్చేస్తున్నారు.
చట్టాలకు అనుగుణంగా మనం మారాలి, అంతే కానీ మనిషి కోసం చట్టాన్ని మార్చాల్సిన అవసరం వచ్చేసింది. అలాంటపుడు చట్టానికి ఉన్న విలువ పై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం లేదంటారా??
ఇప్పటివరకూ సుమారు 110 వరకూ చట్ట సవతణలు జరిగాయి. ఇంతకుముందు నేరాలు చేసిన బాలలకు 18 ఏళ్ళకు మించితేనే శిక్ష అమలు చేసేవారు. ఈ రోజు సవరణ ద్వారా దానిని 16 ఏళ్ళకు తగ్గించారు. ఇది నిర్భయ తల్లి చేసిన కృషి.
ఎన్ని మార్చినా ఏం ఉపయోగం ఉండదు.
చట్టాన్నీ.. ధర్మాన్నీ.. మార్చే శక్తి కేవలం కలానికీ.. సమాజానికి మాత్రమే ఉంది. అప్పుడే సవరణలకు విలువా.. చట్టం పై నమ్మకం ప్రజలకి చేకూరుతుంది.
No comments:
Post a Comment