Wednesday, 9 December 2015

గ్రామాలు: రా..రా.. శ్రీమంతుడా..

ఈ పదం వినగానే ముందుగా కొరటాల శివ గారికీ.. మహేష్ గారికీ ధన్యవాదములు చెప్పాలి.

ఒకసారి చరిత్ర తలుపు మెల్లగా తడితే.. చాలా గ్రామాలలో చాలా మంది శ్రీమంతులు తమ పుణ్యజన్మభూమి మీద ప్రేమతో ఏదొక విధంగా సాయ పడుతూనే ఉండేవారు. అప్పుడు ఇన్ని సాంకేతిక సౌకర్యాలూ.. సామాజిక మాధ్యమాల మనుగడా అంత లేవు కాబట్టి మనకు తెలియలేదు కానీ.. ఆయా గ్రామాల ప్రజలు మాత్రం.. ఆ శ్రీమంతులను తమ గుండెల్లో గాఢంగా భద్రపరుచుకున్నారు.

ఆయా పల్లెల్లో ఏ గుండెనడిగినా.. ఆ శ్రీమంతుల గురించి చెప్పక మానవు. అది ఆ పల్లె జీవితాల మనసులలోని మంచితనం.. మానవత్వం..

కాలంతోపాటూ అవి కూడా మారుతున్నాయి అనుకోండి అది వేరే విషయం. మనకి మంచి కావాలి కదా.. చెడు ఏముంది ఏ చెత్త బుట్టలో అయినా దొరుకుతుంది. కానీ అదే చెత్తబుట్టలో మనం మంచిని వెతికే ప్రయత్నం చేద్ధాం.. మహా అయితే ముందు వాసన వస్తుంది.. తర్వాత కరెంటు వస్తుంది.

ఇప్పుడు నేటి తరం శ్రీమంతులను ఒకసారి కలిసి వద్దాం.. కానీ కొంచెం సమయం పట్టేలా ఉంది.. ఎందుకంటారా.?? ఖర్చు పెట్టాలి అంటే డబ్బులు కావాలి.. డబ్బులు కావాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి కదండీ.. లేకపోతే ఈ కాలంలో స్మార్టు గ్రామాలు ఎలా వస్తాయి చెప్పండి. అభివృద్ధి వేశారా చెయ్యలేదా అనే విషయం పక్కన పెడితే.. వారు తీసుకున్న విషయాన్ని అభినందించి తీరాల్సిందే కదా.. ఏమంటారు???

వారితో మాట్లాడించడం మానేసి ఈ సోదంతా ఏంట్రా బాబూ అనుకుంటున్నారా??? ఏం చెయ్యనండీ వాళ్ళు బహు బిజీ.. అందుకే కవర్ చేద్దాం అని..

ఈ రోజుకి ముఖాముఖి అయ్యేలా లేదు.. ఇంకో సారి చూద్దాం.. వెళ్ళే ముందు ఇక్కడ ఒక మాట వ్రాని వెళ్దాం.. ఎందుకు అంటారా.. మన మీడియా ఫర్ ట్రూత్ ఏదో మంచిని గుర్తు చెయ్యడానికి వచ్చింది అని వారికి తెలియాలి కదా..

"గ్రామాలు భారతదేశానికి పట్టు కొమ్మలు.. అవి మీరు పోసే నీటి కోసం ఎదురు చూస్తున్నాయు"

క్రింద అతికించిన(attach) పత్రము మా గ్రామం కోసం చేసినది.. (ఇంకా ఉపయోగపడలేదు అనుకోండి) మీ గ్రామానికి ఉపయోగ పడుతుందేమో చూడండి.

No comments:

Post a Comment