ఒక చిన్న ఆశకి ఉన్న విలువ ఎంత అంటే అది దేన్నైనా మార్చగలదు.. ప్రపంచాన్ని.. దేశాల్ని.. మొత్తం మానవాళిని తనంతట తాను మార్చే శక్తి ఆ పదానికి ఉంది అంటే అతిశయోక్తి కాదేమో..
అది మనిషి తాలూక ఒక చిన్న భావనే కావచ్చు.. ఆ భావన మంచిది అయితే.. ఆ మనిషిని ప్రపంచం ముందు నిలబెడుతుంది.. అదే భావన భూమికి భారం అయితే.. ఆ మనిషిని ఈ ప్రపంచానికే దూరం చేస్తుంది..
ఆ చిన్న ఆశే లేకపోతే ఇంత మంది పారిశ్రామిక వేత్తలు తమని తాము ఆయా స్థాయిలలో ఉంచుకునే వారా.. ఇంత అభివృద్ధి.. ఇంత ఆధునికత.. ఇంత సాంకేతికత.. మనం ఊహించడానికే సాధ్యమయ్యేవి కావేమో కదా..
వారు సాదించిన విజయాన్నీ.. వారివారి మనసులలో ఒకప్పుడు మెదిలిన చిన్నిచిన్ని ఆశలే..
ఒకరి ఆశ డబ్బు సంపాదించి ఉన్నత స్ధాయిలో ఉండాలనీ.. మరొకరు అదే డబ్బును సమాజ సేవ కోసం ఉపయోగించాలనీ.. ఇంకొకరు తమ కుటుంబ పరిస్ధితి మెరుగు పరచాలనీ.. ఇలా ప్రతీ ఒక్కరూ తమ ఆశనూ.. కోరికనూ.. నిజం చేసుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు.
మనకి ఎందుకులే ఈ కష్టాలూ.. మనకి ఉన్నదాంట్లో మనం బ్రతికేద్దాం అనుకుంటే.. మొత్తం మన జీవన విధానమే వేరేలా ఉండేదేమో..
అనుకున్న స్థాయికి చేరుకోడానికి ఎన్నో కష్టాలను ఇష్టంగా అనుభవిస్తున్నాం.. అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. ఎన్నో ఉన్నత శిఖరాలను అదిరోహించిన మహానుబావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ.. ఈనాటి యువత తమ ఆశలకు రెక్కలు తొడిగి ఎగరేస్తున్నందుకు ఆనందిస్తూ.. రెక్కలు తొడిగిన ఆ ఆశలు కష్టాలను ఎదుర్కొని అయినా తమ గమ్యాలను చేరుకోవాలని.. మనస్పూర్తిగా కోరుకుంటూ..
మీ మీడియా ఫర్ ట్రూత్
No comments:
Post a Comment