చిన్నప్పుడు ప్రకృతి - వికృతి పదాలు చదువుకున్నాం కదా.. తెలుగులో.. కానీ ఇప్పుడు ప్రకృతి మోపిన వికృత పదాన్ని వింటున్నాం తమిళంలో.. గత సంవత్సరం విశాఖ పై విరుచుకుపడిన హుద్ హుద్, తర్వాత నేపాల్ని నేలమట్టం చేసిన భూకంపం.. ఇపుడు ఇది.
ప్రస్తుతం చెన్నపట్నం పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది, ఎక్కడ చూసినా బురద.. ముంచెత్తిన వరద, రోడ్లపై నదుల ప్రవాహాలు, పులిహోర పొట్లాల కోసం ఆర్ధనాదాలు, అనారోగ్యంతో ఆసుపత్రి పాలు, ఇప్పుడు ఇంత కష్టాన్ని అనుభవిస్తున్న చెన్నై రెండు నెలల క్రితం వరకు దక్షిణభారతదేశానికి పెద్ద దిక్కు, తెలుగు - తమిళ సంస్కృతుల వారధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స, ఎలక్ట్రికల్, మెకానిక్స్ ఒక్కటేమిటి ఏది కావాలన్నా చెన్నై, మరి ఇపుడు, ప్రకృతి రాసిన శిలాశాసనం, శిధిలాల రూపంలో దర్శనమిచ్చింది. నీ అభివృద్ధి నన్ను బాదిస్తే.. నేను నిన్ను బాదిస్తా అని కోపంగా హెచ్చరించింది.
అందరూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నారు, కానీ ఉగ్రరూపంలో ఉన్న ప్రకృతిని తప్పించుకోవడం, అరచేతితో సూర్యుడిని అడ్డగించడం అసాధ్యం. అది మనిషికీ మనిషి నిర్మించుకున్న వ్యవస్థకీ సాధ్యపడదు. నీ ఎండని ఏ.సీ తో ఎదుర్కోగలను, నీ వర్షాన్ని గొడుగుతో ఆపగలను, నీ చలిని స్వెటర్ తో సుఖించగలను, నిన్ను ఇన్ని రకాలుగా అడ్డుకోగల్గుతున్నా కదా.. నిన్ను ఎందుకు లెక్క చెయ్యాలి అనే విపరీత దీరణితో ప్లాస్టిక్, ముడిచమురు,కర్బన కారకాలు వాడుట వల్ల ఇన్నాళ్ళూ ఎన్ని మాటలు అన్నా భరించిన ప్రకృతిమాత చేయి చాచి కొట్టింది.. దాన్ని తట్టుకోడానికి నీకు వేల కోట్లు ఖర్చు అవుతుంది.. అయినా తేరుకోవడం కష్టమే..
నిజానికి అభివృద్ధి మన జీవితంలో ఒక భాగం, రాత్రి పూట లైటు లేకుండా, బయటకు వెళ్తే బైకు లేకుండా జీవితాన్ని ఊహించలేము. ఎండగా ఉన్నపుడు ఏ.సీ కావాలి.. ఫ్రిజ్ కావాలి.. కళ్ళ జోడులో ప్లాస్టిక్ వాడాలీ.. తప్పని సరిగా మారిన వాటిని తప్పు లేకుండా వాడుకోవాలి అంటే??? జనాభా తగ్గించాలీ!!! హిందువుల జనాభా తగ్గిపోతుంది అనీ.. ముస్లింల శాతం పెరిగిపోతుంది జనాభాని పెంచుకుంటూ పోతే ఈ సారి పడే దెబ్బకి కోలుకోవడం కాదు కదా.. కైలాసమే!!! అదే భారతదేశ జనాబా మూడు కోట్లే ఉంటే అందులో మనం లేక పోయినా.. అడవులు నరకాల్సి రాదు, మన వనరులు సరిపోతాయి, అందరికీ అన్నం దొరుకుతుంది, ఇంటికి రెండు కార్లు ఉన్నా కాలుష్యం కనపడదు.
- రవి తేజ దాసరి
ప్రకృతి ప్రకోపం ముందు మనమెంత మానవ మాత్రులం..
S its true n its hurting everyone...,
ReplyDelete