Monday, 14 December 2015

దిల్లీలో మంచి గాలికి మంచి రోజులు???

అసలు విషయం ఏంటంటే.. శీతాకాలంలో భూమికి దగ్గరగా పొగమంచు పొర ఏర్పడుతుంది. దీని వలన వివిధ కారణాల ద్వారా విడుదల అయ్యే కర్బన పదార్దాలు మన చుట్టూ తిరుగుతూ.. మనం పీల్చే మంచి గాలిని అవి పీల్చేస్తాయి.

కేవలం దిల్లీలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని కదా.. మీ అనుమానం?? దీనికి రెండు కారణాలు ఉన్నాయి.

మొదటిది.. ఇటుకలు తయారు చేసే కేంద్రాలు దిల్లీలోనూ మరియూ దిల్లీ సరిహద్దు ప్రాంతాలలో చాలా ఎక్కువ. ఈ కేంద్రాల నుంచి అత్యధికంగా కర్బన పదార్ధాలు గాలిలోకి విడుదల అవుతాయి. దీనికి తోడు శీతాకాలంలోనే ఇటుకలను అత్యధిక  సంఖ్యలో ఉత్పత్తి చేస్తుండడంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. దీనిని 1996లోనే గుర్తించిన కోర్టు, దిల్లీలోని ఇటుకల తయారీ కేంద్రాలను నిషేదించింది. అయినా ఆదాయానికి అలవాటు పడ్డ ప్రాణాలు ఏం చేస్తారు చెప్పండి.. వాటిని తీసుకెళ్ళి దిల్లీ సివారు ప్రాంతాలలో స్ధాపించడం మొదలు పెట్టారు. కనుక కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

ఇక రెండవది.. అసలే సెంట్రల్‌ గవర్నమెంటు ఉద్యోగులు ఎక్కువ.. అదీ కాకుండా జీతాలు డబుల్ అయ్యాయి.. ఇవే కాక అత్యధిక ప్రైవేటు కంపెనీలూ అదే విధంగా వారి జీతాలూ.. మరి అన్ని కాసులు కేరింతలు కొడుతున్నపుడు.. ఇంటికి రెండు మూడు కార్లు కొనకుండా ఎలా ఉంటారు చెప్పండి??

ఈ విధంహా కార్ల వలన కూడా కర్బనాలు పెరగడంతో.. సుప్రీంకోర్టు కోర్టు రంగంలోకి దిగి " its Dhilli..?? Or Gas Chamber..?? అనే కామెంట్లతో పాటూ.. ప్రభుత్వాలకు వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది. దీనితో సొంత కార్లను 15 రోజులు మాత్రమే బయటకు తీయాలీ అనే నిబందనలతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను జనవరి 1, 2016 నుంచి మొదలు పెట్టనుంది.. కాగా దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అలా చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. మన మంచి కోసమే చెప్తున్నా.. ట్విట్టర్లో ఈ కామెంట్లు బాదాకరం..

Will @ArvindKejriwal tell us how many extra trips will #DelhiMetro run to ensure less crowding to support #DelhiOddEvenLogic?

Yeh kya pagalpan hai!! This will encourage ppl to have 2 vehicles with odd n even numbers for sure! Improve public Transport  #DelhiOddEvenLogic

#DelhiOddEvenLogic for vehicles is one of the most absurd measures I have heard in recent times. It just puts more hardship to common man.

#DelhiOddEvenLogic To address water scarcity drink water/ bathe/clean only on even odd days.

#DelhiOddEvenLogic is one complete oddity

I pay my driver 12000 pm, now he won't have work for half of the month what am I suppose to do with him ? Fire him ??#DelhiOddEvenLogic

No comments:

Post a Comment