Thursday, 17 December 2015

ఆత్రేయ చేతి రాత, మన మెదడుకు మేత..

అది 1957, అప్పుడప్పుడే కుదుట పడుతున్న స్వతంత్ర భారతదేశం.

"ఆడుతు వాడుతు పని చేస్తుంటే.. అలుపూ సలుపేమున్నదీ.." అంటూ రాసిన పాట.. ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ నోళ్ళలో నానుతూనే ఉంది.

మన జీవితాన్ని ఆనందమంయంగా మనమే మల్చుకోవాలి అనే అర్ధంలో రాసిన పాట.. "శిలలపై శిల్పాలు చెక్కినారూ.."

పూర్తిగా ప్రేమమైకపు ఆలోచనలతో నిండిపోయిన మనసుల బాదని వివరిస్తూ.. " మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే.." ఈ పాటని, ప్రేయసి వలన బాదపడ్డప్పుడు పాడుకోని మగాడు ఉండడు.

"అమ్మా చూడాలీ.. నిన్నూ నాన్నను చూడాలీ" అంటూ.. ఇప్పటి హాస్టళ్ళలో మగ్గుతున్న పిల్లలు పాడటాన్ని.. అవి ఆ హాస్టళ్ళ గోడలు విని కన్నీరు కారచడాన్ని.. ఆయన అప్పుడే పసిగట్టి ఉంటారు.

"ఉన్నావా.. అసలున్నావా.. ఉంటే కళ్ళు మూసుకున్నావా?" అని తప్పు జరిగినపుడు చూస్తూ వెళ్ళిపోయే.. ఇప్పటి తరాన్ని గురించి.. ఎప్పుడో రాశారు.

" సిరిమల్లె పువ్వల్లె నవ్వు.. చిన్నారి పాపల్లె నవ్వు.." అని ఇప్పటి అందమైన కాలేజీ పాపలపై ఆయన అప్పుడే బాణాలు విసిరారు.

"ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.." అందుకే " కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళూ.. వెర్రెక్కీ ఉన్నోళ్ళు.." అమ్మాయిల చేస్టలు బరించలేక.. అని ఆ ప్రియమైన ప్రేమ చేస్టలను.. ప్రేమగా అభివర్ణించారు.

" ఎదుట నువ్వే.. యదలోనా నువ్వే.." అన్నందుకు.. " చిన్నారి పొన్నారి కిట్టయ్యా.. నిన్ను ఎవరు కొట్టరయ్యా.." అని ఓ అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్న ఓ ప్రేమికుడిని ఆప్యాయంగా అడిగారు ఆత్రేయ..

ఏంటీ ఈ రోజు ఆత్రేయ గారి జయంతా.. లేక వర్దంతా..?? అనే కదా మీ అనుమానం!!!  ఏదీ కాదు. ఏదీ కానపుడు వారి గురించి ప్రస్ధావించడం ఎందుకు అంటారా??
మంచి వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మంచిదే కదా ఏమంటారూ??

ఇవే కదు ఇంకా ఎన్నో ఆత్రేయ రాతలు వినాల్సందే..

1 comment: