Saturday, 19 December 2015

దుడ్డు ఉండీ.. దొడ్లు లేని దేశం.

ఏంటీ రివర్స్ లో ఉందేంటీ అనుకుంటున్నారా... కొంచెం ఆలోచించి చూడండి అదే కరెక్ట్ అనిపిస్తుంది.

ఇంతకు ముందు రాజులు పరిపాలించే కాలంలో కుటుంబ పరిపాలన అయినప్పటికీ.. నీతీ, నిజాయితీ, ధర్మం.. ఈ మూడింటిపైనా ఆనాడి పరిపాలన, తమ ఆస్ధాన ప్రజలు పది కాలాల పాటు  ప్రశాంతంగా సుఖసంతోషాలతో జీవించాలి అన్నట్టు  ఉండేది.. అందుకే ఆ కాలంలో యదా రాజా.. తదా ప్రజా అనే వాళ్ళు..

అదే ఇప్పుడు డబ్బూ.. అధికారం ఆపైన వచ్చే అహంకారం.. ఈ మూడింటి పైనా ఈనాటి పరిపాలన, ప్రజాలు ఏమైమోయినా పర్లేదు.. తమ తరతరాలుగా ఎంత తిన్నా తరగని ఆస్తులు కూడబెట్టి.. ఎలాగో ఎలక్షన్లు వచ్చే సరికి, సంపాదించిన దానిలో 1 % డబ్బు ఓట్లకు విసిరేస్తే.. అవే రెక్కలు కట్టుకొని వాలిపోతాయి కాబట్టి ఈ కాలంలో యదా ప్రజా.. తదా రాజా..

ఒక నిమిషానికి - 1,00,000
ఒక గంటకి - 60,00,000
ఒక రోజుకి - 6,00,00,000/ 10 గంటలు చొప్పన
100 రోజులకి - 600,00,00,000

పార్లమెంటులో అధికార పక్షం.. ప్రతి పక్షం.. సంవత్సరంలో 100 రోజుల పాటు కొట్టుకోడానికి ( వారు కొట్టుకోవడం కంటే పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు)  కావాల్సిన డబ్బు అక్షరాలా.. ఆరు వందల కోట్లు.. ఇవి కాక వారు కొట్టుకుంటున్నందుకు కారు పెట్రోలు, ఉండటానికి ఇల్లు ఇంకా ఎన్నో..

ఈ డబ్బుతో ఇంటికి 3,00,000 చొప్పున, ఇప్పటికీ స్మార్ట్ నగరాలలోని స్లమ్ములలో స్మెల్లు ముసుగులలలో నివసిస్తున్న 20,000 మందికి ఇళ్ళు కట్టి ఇవ్వొచ్చు..

అలా కాకపోతే పల్లెల్లో ఆ 600,00,00,000 కోట్లతో.. ఒక లక్ష బాత్రూమ్ల కట్డంచొచ్చు..

మన దేశం పేద దేశం కాదు..
ప్రజల బాదలు పట్టించుకునే నాయకులు లేక..
స్వార్దం అనే పదం నాయకుల ఇంటి పేరుగా మారి..
పేద ప్రజల ఒంటి పేర్లు మార్చేస్తుంది..

No comments:

Post a Comment