Wednesday, 16 December 2015

నాన్నా.. నేనూ.. : A Real Story

మా రాచర్ల గ్రామం లొని భూమి సర్వే కోసం పశ్చిమ గొదావరి జిల్లా.. పెంటపాడు మండల సర్వెయరు గారిని పిలిచాము. అతను వచ్చి సర్వే  నిర్వహించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సర్వే పూర్తి అయ్యాక మా నాన్న గారు ఇంటికి వచ్చి సర్వేయరు గారికి డబ్బులు ఇచ్చి రారా అన్నారు. నేను అదేంటి గవర్నమెంటు జీతం ఇస్తుంది కదా అని అడిగాను. అపుడు మా నాన్న గారు అన్నారు.. "మన చేను పక్కన వాళ్ళు ఇచ్చాక మనం ఇవ్వక పోతే రేపు ఏదొక మెలిక పెడతాడు.. ఆ బాదలు అన్ని మనకు అవసరమా వెళ్ళి ఇచ్చిరా" అన్నారు. నేను వెళ్ళాను కాని ఇవ్వకుండా వచ్చేశా..

ఎందుకు ఇవ్వాలి ఐనా...??? అది కష్టపడి సంపాదించుకున్న భూమి... కనుక ఎందుకు భయపడాలి??? ఈ గవర్నమెంటు ఉద్యొగుల బ్లాక్ మెయిలింగ్ ఏమిటి??? మనం పుట్టిన గ్రామాలలో.. ఏం తప్పు చెయ్యకుండా.. ఎందుకు డబ్బులు ఇవ్వాలి అసలు??? నాకు అర్ధం కావట్లేదు???

ఈ విఆర్వో, ఆర్.ఐ, యమ్.ఆర్.వో ఇలా గవర్నమెంటు ఉద్యోగులు అందరూ ఇలానే బల్ల కింద బల్లుల్లా తయారు అయ్యారు. ఎవరు వస్తారా.. ఎంత నొక్కేద్దామా అని చూస్తారు.

మాలాంటి సన్నకారు రైతులు ఎలా బతికేది..???

ఇది ఒక్కటే కాదు.. గవర్నమెంటు ఉద్యొగులు అంతా ఇలానే ఉన్నారు.

గవర్నమెంట్లేమో.. ఉద్యోగులు ఓట్లు వెయ్యరేమో అని చెప్పి, వారి చెప్పినట్లు చేస్తున్నాయి. ఖజానా ఖాళీగా ఉన్నా.. జీతాలు పెంచడం ఏంటి??? ఆదాయం పెరిగాకా బోనస్లు ఇవ్వాలి కానీ??? వాళ్ళకి లక్ష్యాలు లేక ఇలా ఉంటున్నారు.

లక్యాలు ఇవ్వండి అందరికీ.. కసిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేసి అప్పుడు ఏమైనా తీసుకోండి. అప్పుడు మేమే ఆనందంగా ఇస్తాము.

త్వరగా తగిన పరిష్కారం కనుక్కంటే మంచిది.

No comments:

Post a Comment