ఇది రెండక్షరాలతో మొదలయ్యే ఆశ.. మూడక్షరాల ఆశయంగా మారి.. సరైన కృషి చేస్తే మనల్ని ప్రపంచం ముందు నిలబెడుతుంది.
నీ జీవిత ఆశయం ఏంట్రా..??? అని అందరూ అడుగుతుంటారు. కెరీర్ పైన క్లారిటీ ఉన్నవారు ఈ ప్రశ్న వినడానికి చాలా కమ్ఫర్టుగా ఫీల్ అవుతారు.
అదే కేరీర్ పైన ఎటువంటి క్లారిటీ లేనివారు ఈ ప్రశ్న వినగానే.. IAS, IPS.. ఇలాంటి కాకుండా అని బాగా చనువుగా ఉన్న వారితో మొదలుపెడతారు. అదే పెద్ద వారు ఐతే ఏం చెప్పాలో తెలియక అటూ..ఇటూ చూస్తూ ఉండిపోతారు.
కానీ, ఆ ఆశ.. ఆశయంగా మారినపుడు.. ఆ ఆశయాన్ని సాధించుకోడానికి కష్టాలు పడుతున్నపుడు చూసేదే ప్రపంచం అంటే...
ఆ ఆశయ సాధన సమయంలో పరిచయమయ్యేదే ప్రపంచం అంటే..
ఆ గమ్యస్ధాన చేదన కోసం పడేదే తపన అంటే..
ఆ ఆశయాన్ని శాసనంగా నిలుపుకునే సమయంలో నిలిచేదే పట్డుదల అంటే..
ఇవి చాలవంటారా జీవితంలో ఎలా పైకి రావాలో చెప్పటానికి.. ఇవన్నీ మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న యుద్ధాలు.
యుద్ధంలో గెలిచిన వాడు వీరుడు.. అదే యుద్ధాన్ని ఆపినవాడు దేవుడు.
కాబట్టి వాటిని యుధ్ధంలా కాక పరమార్ధంగా బావించి అదిగమిస్తే.. మన ఆశయాలు ఆశలుగా మిగలకుండా.. చరిత్రలో చిరస్ధాయిగా మిగిలిపోతాయి.
No comments:
Post a Comment