తల్లిదండ్రులు వారి పిల్లల నుంచి ఏమీ ఆశించరు. కానీ వారు ఏ పని చేసినా వారి పిల్లల భవిష్యత్తు కోసమే.. ప్రధానంగా మన దేశంలో ప్రతీ కుటుంబంలో కనిపించే చాలా ప్రియమైన విషయం ఇది...
కానీ ఆ తల్లిదండ్రులు వారి పిల్లల కోసం స్థోమతకు మించి ఖర్చు పెడితే..?? అప్పులు చేసి మరీ ఆ పిల్లల బాగోగులు చూసుకుంటే..??( కొన్ని కుటుంబాలలో జరుగుతూనే ఉన్నాయి.)
తీరా వారి పిల్లలు సరైన సమయంలో సరైన విధంగా వృద్ధిలోకి రాకపోతే..?? ఆ తల్లిదండ్రులు కష్టాలకు ఇక కన్నీరు తోడవుతుంది.. కానీ ఇవేమీ వారి పిల్లలకు తెలియనివ్వరు.
ఆ తల్లిదండ్రులు కష్టాలు త్వరగా తీరిపోవాలని కోరుకుందాం.
ఇక ఉద్యోగం వచ్చిన వారి కష్టాల దగ్గరకి వస్తే..
గ్రామాలేమో తల్లిదండ్రుల పెంకుటిండ్లు.. పట్టణాలేమో పిల్లల అపార్టుమెంట్లు..
ఆ పెంకుటిళ్ళ మనసులు పిల్లలతోపాటు ఇక్కడే ఉండిపోవాలని కలలు కంటాయి..
ఆ అపార్టుమెంట్లు అమ్మానాన్నలని ఎలాగైనా ఇక్కడకు తీసుకువచ్చేయాలని చూస్తుంటాయి.
దీనిలో ఏ ఒక్కటీ జరగదు.. ఎందుకంటే.. తల్లిదండ్రులు ఆ ఊర్లను వదిలి ఉండలేరు.. పిల్లలు ఆ ఉద్యోగాలు వదిలి ఉండలేరు..
అభివృద్ధి.. అభివృద్ధి.. అనుకుంటూ.. అనుబందాలకీ.. ఆప్యాయతలకూ.. దూరమైపోతూ భవిష్యత్తు తరాలకు ఏం అందిస్తున్నాం.. మనం???
No comments:
Post a Comment